డైరెక్టర్ కొరటాలపై నాంపల్లి కోర్టు సీరియస్..!

Tue,June 27, 2017 08:31 PM
nampallycourt serious on koratala shiva in sreemanthudu controversy


హైదరాబాద్ : శ్రీమంతుడు మూవీ కాపీ వివాదానికి సంబంధించి నాంపల్లి కోర్టు హీరో మహేశ్‌బాబుతోపాటు ఆ చిత్ర నిర్మాత ఎర్నేని నవీన్‌కు మరోసారి సమన్లు జారీచేసింది. మహేశ్‌బాబుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేమన్న కోర్టు..గిరిధర్ పేరుతో మహేశ్‌కు హైకోర్టు నుంచి మినహాయింపు తీసుకురావడం చెల్లదని స్పష్టం చేసింది. అలాగే డైరెక్టర్ కొరటాల శివపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు ద్వారా మినహాయింపు కోరడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు, గతంలో సమన్లు జారీ చేసినప్పటికీ ఎందుకు హాజరుకాలేదని కొరటాల శివని ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 7కు వాయిదా వేసింది. శరత్‌చంద్ర అనే వ్యక్తి తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను అనుమతి లేకుండా తీసుకున్నారని శ్రీమంతుడు టీంపై కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

2250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles