నాని- విక్ర‌మ్ కుమార్ మూవీపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్‌

Sun,December 2, 2018 11:01 AM
nani 24 movie official announcement came

హ్య‌ట్రిక్ విజ‌యాలు సాధించిన మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఇటీవ‌ల ఓ క్రేజీ కాంబినేష‌న్‌ని సెట్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. నేచుర‌ల్ స్టార్ నాని, క్రేజీ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ లో ప్ర‌స్టేజియ‌స్ ప్రాజెక్ట్‌ని నిర్మించేందుకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ స‌న్నాహాలు చేస్తుంద‌ని అన్నారు. తాజాగా దీనిపై అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ చేశారు. నాని 24వ చిత్రానికి సంబంధించిన చిత్రంకి పీసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేయ‌నుండ‌గా, ఫిబ్ర‌వ‌రి 19 నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే ప్రాజెక్ట్‌కి సంబంధించి నాని ఫోటో షూట్ కూడా పూర్తి అయిన‌ట్టు స‌మాచారం. చిత్రంలో సిద్ధార్ద్ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. నాని ప్ర‌స్తుతం క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న జెర్సీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 19న ఈ చిత్రం విడుద‌ల కానుంది.ఈ మూవీ త‌ర్వాత ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.

1543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles