విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై నాని ఎమోష‌న‌ల్ ట్వీట్

Thu,April 25, 2019 01:06 PM
nani emotional tweet about students

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్షల‌లో తాము ఫెయిల‌య్యామ‌ని తీవ్రంగా క‌ల‌త చెంది ఆత్మ‌హ‌త్య‌ల‌కి పాల్ప‌డుతున్న విద్యార్ధుల‌లో ధైర్యం నింపేందుకు సెల‌బ్రిటీలు ముందుకు వ‌స్తున్నారు. ఇది గొప్ప ప‌రిణామంగా చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు మారుతి, హీరో రామ్‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా విద్యార్ధులు ఆత్మ‌హ‌త్య‌ల‌కి పాల్ప‌డ‌వ‌ద్దని కోరుతున్నారు. ఏ క‌ష్టాన్నైన‌ ధైర్యంగా ఎదుర్కొవాలే త‌ప్ప ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం సరికాదు అని వారు వాపోతున్నారు. తాజాగా జెర్సీ సినిమాతో మంచి విజ‌యం సాధించిన నాని త‌న ట్విట్టర్‌లో విద్యార్ధుల‌ని ఉద్దేశించి ఎమోష‌న‌ల్ ట్వీట్ పెట్టాడు. చ‌దువు అంటే మార్కుల ప‌త్రాల‌పై నెంబ‌ర్లు కాదు. నేర్చుకోవ‌టం మాత్ర‌మే. నువ్వు అర్హ‌త సాధించని ప్ర‌తీ సారి తిరిగి పోరాటం చేయి. అస్స‌లు వ‌దలొద్దు. వీటన్నింటికంటే జీవితం చాలా ముఖ్య‌మైన‌ది. మీ త‌ల్లితండ్రుల గురించి, మిమ్మ‌ల్ని ప్రేమించే వారి గురించి ఒక్క‌సారి ఆలోచించండి. వారు ప్రేమించేది మీ ఇంట‌ర్మీడియెట్ రిజ‌ల్ట్స్‌ని కాదు.. కేవ‌లం మిమ్మ‌ల్ని చూసి అంటూ నాని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.అయితే ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని , ఇప్పటికే రీ వెరిఫికేషన్, కౌంటింగ్‌కు దరఖాస్తు చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లించనున్నట్లు ఇంట‌ర్మీడియెట్ బోర్డు పేర్కొంది.1945
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles