నాని, నాగ్‌ల మ‌ధ్య బిగ్ ఫైట్ తప్ప‌దా ?

Sun,May 19, 2019 07:49 AM

అక్కినేని నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో దేవదాస్ అనే చిత్రం తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వీరిరివురు వేరే వేరే ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. నాగ్ త‌న కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన మ‌న్మ‌థుడు చిత్రానికి సీక్వెల్ చేస్తుండ‌గా, నాని గ్యాంగ్ లీడ‌ర్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే రీసెంట్‌గా నాని న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ చిత్రాన్ని ఆగ‌స్ట్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. జూన్ 30కి షూటింగ్ అంతా పూర్త‌వుతుంద‌ని చెప్పుకొచ్చారు. ఇక నాగార్జున బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న మ‌న్మ‌థుడు 2 చిత్రాన్ని ఆగ‌స్ట్ 29న ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాత‌లు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య బిగ్ ఫైట్ జ‌ర‌గ‌నుందా అని అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.


నాని సినిమా మంచి కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతుండ‌డం, నాగార్జున కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన మ‌న్మ‌థుడు చిత్రానికి సీక్వెల్స్ చేస్తుండ‌డం , ఈ రెండు చిత్రాలు ఒక రోజు గ్యాప్ తో విడుద‌ల కానుండ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌ని కూడా క‌ల‌వ‌ర ప‌రుస్తున్నాయి. రెండు చిత్రాలపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్న‌ప్ప‌టికి ఒకే సారి విడుద‌లైతే లెక్క‌ల‌లో తేడాలు వ‌స్తాయ‌ని అంటున్నారు. మ‌రి దీనిని దృష్టిలో ఉంచుకొని ఏ చిత్ర నిర్మాత‌లు త‌మ చిత్రాన్ని వాయిదా వేసుకుంటారో చూడాలి. నాని న‌టిస్తున్న గ్యాంగ్ లీడ‌ర్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, మ‌న్మథుడు 2 చిత్రాన్ని రాహుల్ ర‌వీంద్ర‌న్ తెర‌కెక్కిస్తున్నాడు.

2317
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles