సూప‌ర్ హిట్ అయితే లేపండి.. లేదంటే వ‌ద్దు

Fri,September 13, 2019 10:48 AM

నేచుర‌ల్ స్టార్ నాని.. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన చిత్రం గ్యాంగ్ లీడ‌ర్. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లైంది. సినిమాకి పాజిటివ్ రివ్యూస్ ల‌భిస్తుండ‌డంతో అభిమానులు ఆనందంతో గంతులేస్తున్నారు. ఓ గ్యాంగ్ ప్ర‌తీకారం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ప్రియాంక క‌థానాయిక‌గా న‌టించింది. లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించారు . చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం చాలా ప్ల‌స్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మించారు. చిత్రం విడుద‌ల నేప‌థ్యంలో నాని ల‌క్ష్మీ భుజంపై ప‌డుకొని ఉన్న ఫోటోని పోస్ట్ చేస్తూ..సినిమా సూప‌ర్ హిట్ అయితే లేపండి.. లేదంటే డిస్టర్బ్ చేయోద్దు. ఈ సినిమా త‌ప్ప‌క న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నా అని పేర్కొన్నాడు నాని. చిత్రంలో నాని పెన్సిల్ పార్ధ‌సార‌థి పాత్ర‌లో క‌నిపించి సందడి చేస్తున్నాడు.



2932
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles