నానిపై మెగా ఫ్యాన్స్ ఫైర్..!

Tue,February 26, 2019 11:29 AM

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం జెర్సీ చిత్రంతో బిజీగా ఉండ‌గా, త్వ‌ర‌లో విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 24వ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. నాని బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ మూవీకి గ్యాంగ్ లీడ‌ర్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్, టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లో చిన్నపాప సర్..కూతురు వయస్సుంటుంది. ఎనిమిదేళ్లుంటాయి..అనే డైలాగ్స్ తో ప్రారంభమయింది. ఐదుగురు మహిళలకు గ్యాంగ్ లీడర్‌గా ఆ ఒక్క‌డే ఉన్నాడు అని టీజ‌ర్‌లో చెప్పారు. ఈ టీజ‌ర్‌పై మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాని నాని త‌న సినిమాకి గ్యాంగ్ లీడ‌ర్ అనే టైటిల్ పెట్ట‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ నానికి వ్య‌తిరేఖంగా #BoycottNanisGangLeader అనే హ్య‌ష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచిన గ్యాంగ్ లీడర్ టైటిల్‌తో నాని సినిమా చేయాల‌నే ఆలోచ‌న‌ని విర‌మించుకోవాల‌ని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మ‌రి దీనిపై నాని కాని లేదంటే చిత్ర బృందం కాని స్పందిస్తారా అనేది చూడాలి.


3524
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles