షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ నాని.. కొన్ని రోజుల పాటు విశ్రాంతి

Wed,June 12, 2019 08:16 AM
Nani Gets Injured

నేచుర‌ల్ స్టార్ నాని రీసెంట్‌గా జెర్సీ చిత్రంతో మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం విక్రమ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ లీడ‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని ఇటీవ‌ల టీం ప్ర‌క‌టించింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం షూటింగ్‌లో యాక్ష‌న్ సీక్వెన్స్ తెర‌కెక్కిస్తుండ‌గా, చేతి మ‌ణిక‌ట్టుకి బ‌ల‌మైన గాయ‌మైందని తెలుస్తుంది. వైద్యులు నానిని కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోమ‌ని సూచించార‌ట‌. నానికి గాయం కార‌ణంగా చిత్ర షూటింగ్‌కి కొద్ది రోజుల పాటు బ్రేక్ వేశార‌ట‌. మ‌రి ఈ నేప‌థ్యంలో చిత్రం అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. గ్యాంగ్ లీడ‌ర్ చిత్రం లో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్రియాంక‌, ల‌క్ష్మీ , శ‌ర‌ణ్య‌, అనీష్ కురువిళ్ళా, ప్రియ‌ద‌ర్శి, ర‌ఘుబాబు, వెన్నెల కిషోర్, జైజా, స‌త్య త‌దిద‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో అయిదుగురు అమ్మాయిలు దొంగ‌లుగా ఉంటారని వారికి నాయ‌కుడిగా నాని ఉంటారట‌. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. మ‌రోవైపు నాని .. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

1849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles