ఐదుగురు అమ్మాయిల‌కి లీడ‌ర్‌గా నాని..!

Thu,May 16, 2019 01:34 PM

నేచురల్ స్టార్ నాని జెర్సీ చిత్రం తర్వాత విక్రమ్ కే కుమార్ తో గ్యాంగ్ లీడ‌ర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నాని పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన లుక్ ను, టీజర్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, ఇందులో నాని ఐదుగురు మహిళలకు లీడర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ అయిదుగురు అమ్మాయిలు దొంగ‌లుగా ఉంటార‌ని స‌మాచారం. వారి నాయ‌కుడిగా నాని సందడి చేయ‌నున్నాడ‌ట‌. ప్ర‌తి చిత్రంలోను విభిన్న పాత్ర‌లు పోషిస్తూ అల‌రిస్తున్న నాని ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని మ‌రింత ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నాడ‌ట‌. నాని- విక్ర‌మ్ కుమార్ గ్యాంగ్ లీడ‌ర్ సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రోవైపు నాని .. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

2172
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles