నాలుగు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న నాని

Sat,February 2, 2019 09:02 AM
Nani To Appear In Four Different Shades

ప్ర‌యోగాల‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన నాని ప్ర‌స్తుతం జెర్సీ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో క్రికెట‌ర్ పాత్ర‌తో పాటు మ‌రో భిన్న‌మైన పాత్రని చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోగా, ఏప్రిల్ 19న మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. ఇక క్రేజీ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాని త‌న 24వ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. పీసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేయ‌నుండ‌గా, ఫిబ్ర‌వ‌రి 19 నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే ప్రాజెక్ట్‌కి సంబంధించి నాని ఫోటో షూట్ కూడా పూర్తి అయిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ చిత్రంలో నాని నాలుగు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో ఒక మ‌నిషి జీవితం యొక్క నాలుగు వేర్వేరు ద‌శ‌ల‌ని చూపించ‌నున్నార‌ని అంటున్నారు. నాని 19 ఏళ్ళ టీనేజ‌ర్‌గాను , 25 ఏళ్ళ యువ‌కుడిగాను, 40 ఏళ్ళు, 50 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న మ‌ధ్య వ‌య‌స్కుడిగాను క‌నిపిస్తార‌ట‌. హాలీవుడ్ చిత్రం ది క్యూరియ‌స్ కేస్ ఆఫ్ బెంజ‌మిన్ బ‌ట‌న్ లైన్‌ని బేస్ చేసుకొని విక్ర‌మ్ కుమార్.. నానితో మూవీ తీయ‌నున్నాడ‌ట‌. కీర్తి సురేష్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌, మేఘా ఆకాశ్ ఇందులో క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్నారని టాక్. చిత్రంలో సిద్ధార్ద్ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. మరి ఈ వార్త‌ల‌పై క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

2213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles