'గ్యాంగ్ లీడర్'గా నాని..ఫస్ట్ లుక్, టీజర్

Mon,February 25, 2019 12:26 PM

న్యాచురల్ స్టార్ నాని జెర్సీ చిత్రం తర్వాత విక్రమ్ కే కుమార్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నాని తన పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన లుక్ ను, టీజర్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచింది గ్యాంగ్ లీడర్. ఇపుడు ఇదే పవర్ ఫుల్ టైటిల్ ను తన కొత్త చిత్రానికి పెట్టాడు నాని. గ్యాంగ్ లీడర్ టైటిల్ లుక్ పోస్టర్ తోపాటు టీజర్ ను కూడా నాని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ఒక చిన్నపాప సర్..కూతురు వయస్సుంటుంది. ఎనిమిదేళ్లుంటాయి..అనే డైలాగ్స్ తో ప్రారంభమయ్యే టీజర్ ఆసక్తికరంగా ఉంది. గ్యాంగ్ లీడర్ లుక్, టీజర్ నాని అభిమానులకు కనువిందు చేస్తోంది. ఈ చిత్రంలో నాని ఐదుగురు మహిళలకు లీడర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.


2700
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles