మ‌హేష్ చేతుల మీదుగా విడుద‌లైన 'బిగ్ బాస్' గీతం

Tue,August 21, 2018 09:53 AM
Nannu Dochukunduvate  Big Boss Anthem Video released

ఇటీవ‌ల స‌మ్మోహ‌నం చిత్రంతో బిగ్గెస్ట్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు ప్ర‌స్తుతం నన్ను దోచుకుందువ‌టే చిత్రంతో బిజీగా సంగ‌తి తెలిసిందే. ఆర్ ఎస్ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో న‌న్ను దోచుకుందువటే అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవ‌ల‌ చిత్ర ఫ‌స్ట్ లుక్ , టీజ‌ర్‌ విడుద‌లైంది.ఇది అభిమానుల‌ని అల‌రించింది. చిత్రంలో సుధీర్ బాబు కాస్త డిఫ‌రెంట్ మెంటాలిటీ ఉన్న మేనేజ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, హీరోయిన్ న‌బా న‌టేష్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా క‌నిపించనుంది. కీలక పాత్రల్లో నాజర్‌, వేణులు నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్‌ బి లోకనాథ్‌ సంగీతమందిస్తున్నారు . ఇటీవ‌ల సొంత ప్రొడ‌క్ష‌న్ హౌజ్ స్థాపించిన సుధీర్ బాబు త‌న నిర్మాణ సంస్థ‌లో తొలి చిత్రంగా నన్ను దోచుకుందువ‌టే సినిమా చేస్తున్నాడు. సెప్టెంబ‌ర్ 13న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా , ప్ర‌మోష‌న్స్ విష‌యంలో స్పీడ్ పెంచారు మేకర్స్.

కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన సాంగ్స్ విడుద‌ల చేస్తూ సినిమాపై ఆస‌క్తి పెంచుతున్నారు నిర్మాత‌లు. తాజాగా ఈ చిత్రంలోని ‘బిగ్‌బాస్‌’ అనే గీతాన్ని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ‘బిగ్‌బాస్‌ గీతాన్ని విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. సుధీర్‌బాబుకు, ‘నన్నుదోచుకుందువటే’ చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్’ అని ట్వీట్‌ చేశారు. ఓ భయంకరమైన ప్రదేశంలో సుధీర్‌బాబు సూటు వేసుకుని ఓ శవపేటికను ఈడ్చుకుని వెళుతున్నట్లుగా ఈ వీడియోలో కన్పించారు. సుధీర్‌బాబు కింద పనిచేస్తున్న ఉద్యోగులు అతని బాధను తట్టుకోలేక ‘ఓరి దేవుడా..ఈ బిగ్‌బాస్‌ గొడవ తట్టుకోలేకపోతున్నాం. వీడో యమధర్మరాజు’ అంటూ పాడటం ఫన్నీగా ఉంది. మరోపక్క సుధీర్‌ దెయ్యాల కొంపలో పుర్రెలు, పొగల మధ్యలో డ్యాన్స్‌ చేయడం ఆకట్టుకుంటోంది. మ‌రి మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

2078
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles