త‌ల్లిదండ్రుల‌ని ప‌ట్టించుకోని నాజ‌ర్.. కేసు పెట్టేందుకు సిద్ద‌మైన సోద‌రులు

Sun,May 19, 2019 10:10 AM
Nassar is in trouble

ఎన్నో భాష‌ల‌లో వైవిధ్యమైన పాత్ర‌ల‌తో అల‌రించిన నాజ‌ర్‌పై ప్ర‌స్తుతం ప‌లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. న‌టుడిగానే కాకుండా దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడిగా మంచి ప‌దవిలో ఉన్న ఆయ‌న వృద్ధాప్యంలో ఉన్న‌ త‌ల్లిదండ్రుల‌ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని నాజ‌ర్ సోద‌రులు ఆరోపిస్తున్నారు. ఆర్ధిక సాయం చేయ‌కున్నా క‌నీసం వారి బాగోగులు కూడా తెలుసుకోలేని స్థితిలో ఆయ‌న లేరా అంటూ నాజ‌ర్ సోద‌రులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యంపై ఆయ‌న స్పందించ‌క‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వారు హెచ్చ‌రించారు.

నాజర్ ఫ్యామిలిలో నాజ‌ర్ పెద్ద వాడు కాగా, ఆయ‌న‌కి ముగ్గురు సోద‌రులు ఉన్నారు. చివ‌రి సోద‌రుడు మానసికంగా వ్యాధిగ్ర‌స్తుడు. పెళ్ళి త‌ర్వాత త‌ల్లిదండ్రుల‌కి దూరంగా ఉంటున్నాడు. నాజ‌ర్. అయితే న‌టుడిగా మంచి స్థితిలో ఉన్న నాజ‌ర్ త‌ల్లిదండ్రుల‌ని ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని , వారు అనారోగ్యంతో ఉన్న ప్ప‌టికి ప‌రామ‌ర్శించ‌డం లేద‌ని నాజ‌ర్ సోద‌రులు జవహర్, ఆయుబ్ మీడియాతో మాట్లాడారు. గ‌తంలోను వీరు ఇలాంటి ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ప్ర‌స్తుతం మేమిద్ద‌ర‌మే కుటుంబ భారాన్ని మోయాల్సి వ‌స్తుంది, నాజ‌ర్ ఇప్ప‌టికైన త‌ల్లిదండ్రేలకి అండ‌గా ఉండ‌క‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి మేం సిద్ధ‌మ‌ని వారు అంటున్నారు. నాజర్‌ భార్య కమల్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో సెంట్రల్‌ చెన్నై స్థానం నుంచి పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే.

5531
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles