లేడి సూపర్ స్టార్ నయనతార, స్టార్ దర్శకుడు విఘ్నేష్ శివన్ కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో వారిద్దరి వివాహం జరగనుందని అనేక వార్తలు వస్తున్నప్పటికి, వీరిద్దరిలో ఏ ఒక్కరు స్పందించడం లేదు. కాని ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసి వెళుతుండడంతో అభిమానులు వీరి ప్రేమ విషయంపై ఓ క్లారిటీకి వచ్చారు. వచ్చే ఏడాది వీరి పెళ్ళి ఖాయమని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో ప్రత్యక్షమైన ఈ జంట రీసెంట్గా న్యూయార్క్ వెళ్లింది. అక్కడి అందాలని ఆస్వాదిస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. బోని కపూర్, ఖుషీ కూడా న్యూయార్క్‌లోనే ఉండగా వారిని కూడా కలిసారు. కాగా, నయనతార రీసెంట్గా సైరా, విజిల్ చిత్రాలతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే.