యాక్సిడెంట్‌: రాజ్ త‌రుణ్‌, త‌రుణ్‌?

Tue,August 20, 2019 10:33 AM
netigens confusion in accident

ఈ రోజు తెల్ల‌వారు జామున నార్సింగ్‌ సమీపంలో అల్కాపూర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు ప్రమాదానికి గురైంది. ఆ కారు డివైడర్‌ను డీకొట్టగా, అందులో ప్ర‌యాణిస్తున్న వారికి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. అయితే అందులో ప్ర‌యాణిస్తున్న‌ది యంగ్ న‌టుడు రాజ్ త‌రుణ్ అని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు బాల నటుడి నుండి హీరోగా ఎదిగిన త‌రుణ్ అని చెబుతున్నారు. సోష‌ల్ మీడియాలో యాక్సిడెంట్‌కి సంబంధించి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, కొద్ది సేపటి క్రితం త‌రుణ్ దీనిపై స్పందించిన‌ట్టు తెలుస్తుంది. త‌న‌కి ఎలాంటి యాక్సిడెంట్ కాలేద‌ని, రాత్రి నుండి ఇంటి వ‌ద్దే ఉన్న‌ట్టు త‌రుణ్ స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత కారుని ప్ర‌మాద స్థ‌లంలోనే వ‌దిలి వెళ్ల‌డం చర్చ‌నీయాంశంగా మారింది.ఈ ఘ‌ట‌న‌కి సంబంధించి పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

43608
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles