మెగా హీరో పెద్ద మ‌న‌సుకి నెటిజ‌న్స్ ఫిదా

Wed,October 16, 2019 09:47 AM

మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడ‌ల‌లో న‌డుస్తూ మెగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌. చివ‌రిగా చిత్ర‌ల‌హ‌రి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం ప్ర‌తిరోజూ పండగే అనే సినిమా చేస్తున్నాడు. వెండితెర‌పైనే కాదు బ‌య‌ట కూడా తాను రియ‌ల్‌ హీరో అని చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు . ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌తో అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర‌వేసుకున్న సాయిధ‌ర‌మ్ తాజాగా త‌న బ‌ర్త్‌డే రోజు గొప్ప నిర్ణ‌యం తీసుకున్నాడు. మ‌ధ్య‌లో ఆగిపోయిన ఓల్డేజ్ హోమ్ నిర్మాణం పూర్త‌య్యేవ‌ర‌కు తాను పూర్తి బాధ్య‌త వ‌హిస్తాన‌ని మాటిచ్చాడు. అంతేకాదు సంవ‌త్స‌రం పాటు ఓల్డేజ్ హోమ్ ర‌న్ అవ‌డానికి కావ‌ల‌సిన మొత్తాన్ని తాను స‌మ‌కూరుస్తానని తేజూ చెప్పుకొచ్చాడు. ఈ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకున్న మెగా ఫ్యాన్స్ అంద‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేశాడు. ఇదేదో గొప్ప‌లు చెప్పుకోవ‌డానికి ప‌బ్లిక్ డొమైన్‌లో మాట్లాడ‌డం లేదు. నన్ను చూసి చిన్న పిల్లాడు లేదా పెద్ద వాళ్లు ఎవ‌రో ఒక‌రు ఇన్‌స్పైర్ అయిన చాల‌నే చిన్న కార‌ణంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అని తేజూ స్ప‌ష్టం చేశాడు. పుట్టిన రోజు నాడు తేజు తీసుకున్న ఈ మంచి నిర్ణ‌యంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది.


2335
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles