ఆర్ఆర్ఆర్‌లోకి మ‌రో బ్రిటీష్ లేడి..!

Wed,August 21, 2019 10:31 AM
New actress selected for RRR

టాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రాల‌లో ఆర్ఆర్ఆర్ ఒక‌టి. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, ఎన్టీఆర్‌తో జోడీ క‌ట్టే భామ ఎవ‌ర‌నే దానిపై సస్పెన్స్ నెల‌కొంది. ముందుగా చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న డైసీ ఎడ్గార్ జోన్స్‌ని ఎంచుకున్నాడు రాజ‌మౌళి. కాని అనివార్య కార‌ణాల వ‌ల‌న ఆమె ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో ప‌లువురి పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఇటీవ‌ల అమెరిక‌న్ న‌టి ఎమ్మా రోబ‌ర్ట్స్‌ని ఎన్టీఆర్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు చిత్ర బృందం. తాజా సమాచారం ప్ర‌కారం మరో మారు బ్రిటిష్ నటినే క‌థానాయిక‌గా ఎంపిక చేయాల‌ని రాజ‌మౌళి అండ్ టీం భావిస్తుంద‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ ఇవ్వ‌నున్నారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌కి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం టీం బ‌ల్గేరియా వెళ్లేందుకు సిద్ద‌మైంది. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30,2020న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ భారీ చిత్రంలో అజయ్ దేవగణ్, సముద్ర ఖని వంటి ప్రముఖ నటులు ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు.

1496
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles