'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

Tue,March 19, 2019 09:54 AM

రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 22న విడుద‌ల కానుంద‌ని వ‌ర్మ ఆ మ‌ధ్య ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే చిత్ర రిలీజ్‌కి తెలుగు త‌మ్ముళ్ళు అడ్డుప‌డుతున్న నేప‌థ్యంలో మూవీ రిలీజ్ లేట్ అవుతుంద‌ని అంద‌రు భావించారు. అనుకున్న‌ట్టుగానే ఈ చిత్రాన్ని వారం త‌ర్వాత అంటే మార్చి 29న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. ఈ పోస్టర్‌పై వాడూ, నా పిల్ల‌లు క‌లిసి నన్ను వెన్ను పోటు పొడిచారు అనే క్యాప్ష‌న్ రాసాడు. అస‌లు నిజాలు తెలుసుకోవాంటే మార్చి 29 వ‌రకే ఆగండ‌ని వ‌ర్మ స్ప‌ష్టం చేశాడు. అయితే రేపు ఈ చిత్రాన్ని సెన్సార్‌కి పంప‌నుండ‌గా, మూవీ రిలీజ్‌పై సెన్సార్ బోర్డ్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌ని అంద‌రు ఆస‌క్తిగా చూస్తున్నారు. మ‌రి వ‌ర్మ ఫిక్స్ చేసిన కొత్త డేట్‌కి అయిన చిత్రం రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే కొన్ని గంట‌లు వేచి చూడక త‌ప్ప‌దు మ‌రి.

3502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles