ప్రియాంకపై ఘోరమైన కథనం.. లెంపలు వేసుకున్న అమెరికా పత్రిక

Thu,December 6, 2018 07:21 PM
newyork magazine apologizes to priyanka over defamative piece

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు జంప్ కొట్టిన ప్రియాంక చోప్రాపై న్యూయార్క్ మ్యాగజైన్ దారుణమైన కథనాన్ని రాసి భారత్‌లో తీవ్రమైన వ్యతిరేకత ఎదురుకావడంతో ఉపసంహరించుకున్నది. ఆమె ఓ అంతర్జాతీయ కిలాడి (గ్లోబల్ స్కాం ఆర్టిస్ట్) అని, నిక్ జోనాస్‌ను ప్రేమతో కాకుండా కేవలం తన కెరీర్ కోసమే పెళ్లి చేసుకున్నదని ఆ పత్రికా రాసింది. గత శనివారం పెళ్లి పేరిట జోనాస్ ఓ బూటకపు బంధంలో చిక్కుకున్నాడని కూడా సానుభూతి ఒలకబోసింది. వీలైనంత త్వరగా ఆ బంధం నుంచి బయటపడి పారిపోమని ఉచిత సలహా కూడా పారేసింది. ఈ తరహా పత్రికా కథనంపై బాలివుడ్‌కు చెందిన ప్రముఖులతోపాటుగా ఇతర రంగాలకు చెందినవారు కూడా నిరసన తెలిపారు. ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని పేర్కొన్నారు. కొందరైతే భారతీయ వనిత అమెరికా గడ్డపై పేరు సంపాదించడం ఏమాత్రం ఇష్టం లేని జాత్యహంకారులు మాత్రమే ఇలాంటి వ్యాసాలు రాస్తారని మండిపడ్డారు. సంస్కార హీనంగా ఉందని ధ్వజమెత్తారు. కొందరు పాఠకులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆ పత్రిక సదరు వివాదాస్పద వ్యాసానికి ముందుగా కొన్ని సవరణలు చేసింది. తర్వాత తన సైటు నుంచి ఆ వ్యాసాన్ని మొత్తంగా తొలగించింది. అంతేకాకుండా ప్రియాంక చోప్రాకు, నిక్ జోనాస్‌కు, పాఠకులకు క్షమాపణలు చెప్పింది. ఇక ప్రియాంక అయితే ఆ వ్యాసాన్ని తానసలు పట్టించుకోనేలేదని చెప్పింది.

4730
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles