కేఎల్ రాహుల్‌తో సంబంధంపై నోరు విప్పిన నిధి

Fri,June 1, 2018 08:54 AM

ఐపీఎల్ సీజ‌న్ 11లో పంజాబ్ త‌ర‌పున ఓపెన‌ర్‌గా దిగి గ్రౌండ్‌లో దుమ్ముదులిపిన ఇండియ‌న్ క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ భామ నిధి అగ‌ర్వాల్‌తో క‌లిసి ముంబైలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఫోటోలు రీసెంట్‌గా సామాజిక మాధ్య‌మాల‌లో వైర‌ల్ అయిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ ఫోటోల‌పై నెటిజ‌న్స్ భిన్న ర‌కాలుగా స్పందించారు. కొంద‌రు వీరిద్ద‌రు డేటింగ్‌లో ఉన్నార‌ని కామెంట్స్ పెట్ట‌గా, మ‌రి కొంద‌రు అనుష్క శ‌ర్మ, కోహ్లి జంట‌లా వీరు వివాహం చేసుకోనున్నారా అనే అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో నిధి రూమ‌ర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. నేను రాహుల్ మంచి స్నేహితులం మాత్ర‌మే. ఎప్ప‌టి నుండో మా ఇద్ద‌రికి ప‌రిచ‌యం ఉండ‌డంతో ఇటీవ‌ల బాంద్రాలోని రెస్టారెంట్‌లో డిన్న‌ర్‌కి వెళ్ళాం. రాహుల్ క్రికెట‌ర్ కాక‌ముందు, నేను హీరోయిన్ అవ్వ‌క‌ముందు నుండే ఒక‌రికి ఒక‌రం ప‌రిచ‌యం. మేము ఇద్ద‌రం బెంగ‌ళూరులో క‌లిసి చ‌దువుకున్నాం అనేది అవాస్త‌వం. అలాంటిదేమి లేదంటూ నిధి పేర్కొంది. ఈ అమ్మ‌డు చైతూ హీరోగా తెర‌కెక్కుతున్న స‌వ్య‌సాచి చిత్రంతో టాలీవుడ్‌కి డెబ్యూ ఇస్తుంది. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే .

5523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles