అడ‌ల్ట్ సినిమాల‌కి స్వ‌స్థి ప‌లికిన నిక్యాంక‌..!

Wed,April 17, 2019 12:04 PM
nikyanka says good bye to adult movies

క్రేజీ క‌పుల్ ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్( నిక్యాంక‌) తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. భ‌విష్య‌త్‌ని దృష్టిలో పెట్టుకొని తామిద్ద‌రు ఇక‌పై హాట్ స‌న్నివేశాల‌లో న‌టించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అడ‌ల్ట్ మూవీస్‌, షోస్‌, సిరీస్‌లాంటి వాటిలో ఇక‌పై న‌టించ‌బోమ‌ని తాజాగా నిక్ జోనాస్ ఓ హాలీవుడ్ ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు. కుటుంబం, పిల్ల‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నాం అని నిక్ అన్నారు. డిసెంబ‌ర్ 1, 2018న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఉమాయిద్ భవన్ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో ఘ‌నంగా జరిగింది. ఆ త‌ర్వాత హిందూ సంప్రదాయంలోను వేడుక జ‌రిపించారు. దాదాపు నెల రోజుల పాటు వీళ్ళ పెళ్లి టాపిక్ బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రియాంక‌- నిక్‌ల పెళ్ళి గురించి రోజుకో వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొట్టింది. అయితే త‌న క‌న్న ప‌దేళ్ళు చిన్న‌వాడైన అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా విడాకులు తీసుకోబోతుందంటూ ఓకే! అనే ఆంగ్ల మ్యాగ్‌జైన్ ఇటీవ‌ల ఓ కథనాన్ని ప్రచురించిన విష‌యం విదిత‌మే.

3267
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles