తండ్రి సాంగ్ రీమిక్స్‌ చేసిన త‌న‌యుడు

Wed,October 31, 2018 10:24 AM

ఈ మ‌ధ్య కాలంలో హిట్ సాంగ్స్‌కి రీమిక్స్ లు చేయ‌డం కామ‌న్‌గా మారింది. ఇక కొంద‌రు వార‌సులు త‌మ తండ్రి సినిమాలోని సాంగ్స్‌ని రీమిక్స్ చేస్తూ ప్రేక్షకుల‌కి ఆనందాన్ని పంచుతున్నారు. తాజాగా నాగ చైత‌న్య త‌న తండ్రి నాగార్జున న‌టించిన అల్ల‌రి అల్లుడు సినిమాలోని నిన్ను రోడ్డు మీద చూసిన‌ట్టు సాంగ్ రీమేక్ చేశాడు. అల్ల‌రి అల్లుడు చిత్రంలో నాగ్‌, ర‌మ్య‌కృష్ణ మ‌ధ్య సాగిన ఈ పాట అప్ప‌ట్లో ఎంత హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కీర‌వాణి సంగీతంలో రూపొందిన ఈ సాంగ్ సంగీత ప్రియుల నోట్ల‌లో ఇప్ప‌టికి నానుతూనే ఉంది. అయితే మ‌రోసారి కీర‌వాణి ఇదే సాంగ్‌ని స‌వ్య‌సాచి చిత్రం కోసం రీమిక్స్ చేశాడు. పృధ్వీ చంద్ర‌, మౌనిమ పాడిన ఈ పాట‌కి చైతూ, నిధి అగ‌ర్వాల్ త‌మ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టారు. ఈ సాంగ్‌కి కూడా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. న‌వంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న స‌వ్య‌సాచి సినిమాకి సంబంధించి ప‌లు సాంగ్స్ విడుద‌ల చేస్తూ మూవీపై ఆస‌క్తి క‌లిగించేలా చేస్తున్నారు మేక‌ర్స్. ఈ చిత్రంలో మాధ‌వ‌న్, భూమిక‌లు ముఖ్య పాత్రలు పోషించారు.

2244
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles