వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ కానున్న నితిన్

Fri,March 22, 2019 08:29 AM
nithin busy with upcoming projects

ల‌వ‌ర్ బోయ్ నితిన్ ఇటీవ‌ల త‌న త‌దుప‌రి ప్రాజెక్టుల‌కి సంబంధించిన వివ‌రాల‌ని మార్చి నెలాఖ‌రులో ఎనౌన్స్ చేస్తాన‌ని చెప్పిన విష‌యం విదిత‌మే. అన్న‌ట్టుగానే నిన్న రెండు ప్రాజెక్టుల‌కి సంబంధించిన వివ‌రాలు తెలియ‌జేశాడు. మొద‌టి ప్రాజెక్ట్ ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుండగా, ఈ చిత్రానికి కోనేరు సత్యనారాయణ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు. నటరాజన్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఆగ‌స్ట్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రం ‘ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాల సరసన చేరుతుందని నితిన్ భావిస్తున్నాడు. ఇక మరో చిత్రం ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాడు. ఏప్రిల్ నెల మూడో వారంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంద‌ట‌. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించ‌నున్నారు. మ‌రోవైపు నితిన్‌ ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రంతో పాటు త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం ర‌ట్సాస‌న్ రీమేక్‌లో న‌టించేందుకు కూడా సిద్ధ‌మ‌య్యాడు. ర‌ట్సాస‌న్ అనే త‌మిళ చిత్రం రీమేక్ రైట్స్ ద‌క్కించుకున్న నితిన్ ఈ ప్రాజెక్ట్‌ని కూడా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. మొత్తానికి ఈ ఏడాది వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించ‌నున్నాడు నితిన్‌

930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles