త‌న అమ్మ‌కి క్యాన్స‌ర్ అని తెలిసి వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్

Wed,May 1, 2019 08:29 AM

తెలుగు, తమిళం, మలయాళంలో మంచి క‌థా చిత్రాల‌లో న‌టించి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన న‌టి నిత్యామీన‌న్‌. ముద్దుగా, బొద్దుగా ఉండే ఈ అమ్మ‌డికి ప్ర‌స్తుతం తెలుగులో ఆఫ‌ర్స్ రాక‌పోయిన వేరే భాష‌ల‌లో చాలా సినిమాలు చేస్తుంది. రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్‌లో నిత్యా మీన‌న్‌ని ఎంపిక చేసిన‌ట్టు ఓ ప్రచారం అయితే జ‌రుగుతుంది. కొన్నాళ్ళ క్రితం నిత్యా మీన‌న్ మ‌ల‌యాళ నిర్మాత‌ల ద‌గ్గ‌ర కాస్త దురుసుగా ప్ర‌వ‌ర్తించడంతో ఆమెని మ‌ల‌యాళ సినిమా ప‌రిశ్ర‌మ నుండి బహిష్క‌రిస్తామ‌ని వారు హెచ్చ‌రికలు పంపారు. అస‌లు ఆ స‌మ‌యంలో తాను అలా ఉండ‌డానికి గ‌ల కార‌ణాన్ని తాజా ఇంట‌ర్వ్యూలో వివ‌రించింది నిత్యా మీన‌న్


నిత్యా మీన‌న్.. టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తత్సమయం ఒరు పెంకుట్టీ’ అనే మలయాళ సినిమాలో న‌టించింది. అయితే షూటింగ్‌కి రెగ్యుల‌ర్‌గా హాజ‌రు కాకుండా డుమ్మాలు కొట్ట‌డం, నిర్మాత‌లు ఏర్పాటు చేసిన స‌మావేశానికి కూడా హాజ‌రు కాక‌పోవ‌డంతో నిర్మాత‌లు ఆమెపై ఫుల్ ఫైర్ అయ్యారు. ఆ స‌మ‌యంలో అలా ఉండ‌టానికి కార‌ణం త‌న త‌ల్లి క్యాన్స‌ర్‌కి గురైన విష‌యాన్ని తెలుసుకోవ‌డం. అప్పటికే మా అమ్మ‌కి క్యాన్సర్ మూడో స్టేజ్‌లో ఉంది. షూటింగ్ సమయంలో కార్ వ్యాన్‌లోకి వెళ్లి ఏడ్చేదాన్ని. నా తల్లి గురించి ఆలోచిస్తే కళ్లలో నీళ్లు ఆగేవి కాదు అని నిత్యా మీనన్ వెల్లడించారు. అమ్మ గురించి ఆలోచించి, ఏడ్చి ఏడ్చి తనకు మైగ్రేన్ నొప్పి కూడా వచ్చేదని, ఆ సమయంలో ఎవ్వరితోనూ మాట్లాడే పరిస్థితిలో తాను ఉండేదాన్ని కాదని నిత్యా తెలిపారు. నేను వివ‌ర‌ణ ఇచ్చుకున్నా నిర్మాత‌లు ఏ మాత్రం విన‌లేద‌ని, నాకు అహంభావం ఎక్కువ‌ని వారు విమ‌ర్శ‌లు కూడా చేశార‌ని నిత్య అన్నారు. అయితే ఇలాంటి వాటిని ప‌ట్టించుకోన‌ని చెప్పిన తాను ప‌ని మీదే పూర్తి దృష్టి పెడ‌తాన‌ని పేర్కొంది.

3653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles