బ్రిటీష్ న‌టి స్థానంలో మ‌ల‌యాళ కుట్టీ ?

Fri,April 12, 2019 09:03 AM

ఎస్ఎస్ రాజ‌మౌళి భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దాన‌య్య నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా అలియా భ‌ట్, డైసీ ఎడ్గార్‌ జోన్స్ న‌టిస్తున్న‌ట్టు రాజ‌మౌళి ఇటీవ‌ల ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తెలిపాడు. అయితే ‘‘కొన్ని అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ చిత్రంలో చేయడం లేదు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము.. ’’ అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ ఇటీవ‌ల‌ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. దీంతో ఎన్టీఆర్ స‌ర‌స‌న ఎవ‌రు న‌టిస్తారు అనే దానిపై అందరిలో ఆస‌క్తి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో మ‌ల‌యాళ భామ నిత్యామీన‌న్ పేరు ఫ్రేమ్‌లోకి వ‌చ్చింది. ఇటీవ‌ల నిత్యా.. లుక్‌ టెస్ట్‌ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎన్టీఆర్‌కు జోడీగా నటించబోతున్నారా? లేదంటే మరేదైనా కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేశారా అనేది తెలియాల్సి ఉంది. గుజరాత్‌లోని వడోదరాలో షూటింగ్ జరుపుకుంటున్న స‌మ‌యంలో రామ్ చరణ్‌కు గాయం కావడంతో చిత్ర షూటింగ్‌ 3 వారాల పాటు వాయిదా ప‌డింది. 2020లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

1970
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles