మరోసారి తండ్రి ప్రమోషన్ అందుకున్న స్టార్ హీరో

Fri,May 26, 2017 12:58 PM

మాలీవుడ్ మోస్ట్ గ్లామర్ హీరో నివీన్ పాలీ మరో సారి తండ్రయ్యాడు. 2010లో తన క్లాస్ మెట్ రిన్నా జాయ్ ని వివాహం చేసుకున్నాడు నివీన్. 2012లో ఈ దంపతులిద్దరికి కుమారుడు జన్మించగా, ఇప్పుడు పాప పుట్టింది. తమ ఇంటికి మహలక్ష్మి అడుగు పెట్టింద‌ని నివీన్ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు తెగ ఆనందపడుతున్నారు. నివీన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శివ దర్శకత్వంలో సకవు అనే చిత్రాన్ని చేస్తున్నాడు . ఈ చిత్రంలో మూడు ప్రధాన పాత్రలలో కనిపించనున్నాడు నివీన్. ఇక నటి నుండి డైరెక్టర్ గా మారిన గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూతన్ అనే చిత్రాన్ని కూడా చేస్తున్నాడు నివీన్. ఇవేకాక నివీన్ చేతిలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. హే జూడ్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న చిత్రంలో నివీన్ ప్రధాన పాత్ర పోషించనుండగా, ఆయన సరసన త్రిష కథానాయికగా నటించనుంది. ఇక గౌతమ్ మీనన్ దర్శకత్వంలోను ఓ చిత్రం చేయనున్నట్టు సమాచారం. ఇదీ కాక సాంటా మారాయా అనే ప్రాజెక్ట్ లోను నివీన్ కీలక పాత్ర చేయనున్నట్టు సమాచారం. రిచి అనే తమిళ చిత్రంలోను నివీన్ నటిస్తున్నాడు.

3304
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles