బాహుబ‌లి సాంగ్ స్టైల్‌లో మ‌ల‌యాళం పాట‌

Thu,September 26, 2019 12:42 PM

చ‌రిత్రలు తిర‌గరాసిన బాహుబ‌లి చిత్ర విజ‌యంలో సంగీతం కూడా ముఖ్య భూమిక పోషించిన సంగ‌తి తెలిసిందే. కీర‌వాణి స‌మ‌కూర్చిన బాణీల‌కి సంగీత ప్రేక్ష‌కులు ఎంత‌గానో మురిసిపోయారు. తాజాగా చిత్రంలోని ఓరోరి రాజా వీరాది వీరా అనే పాట‌ని మ‌ల‌యాళీలు అదే స్టైల్‌లో రూపొందించారు. బాహుబ‌లి పాట‌లో మాదిరిగానే కళాకృతిని, సెట్టింగ్ రూపొందించి పాట రెడీ చేశారు. అనాశ్వ‌ర రాజ‌న్.. ప్ర‌భాస్ పాత్ర‌లో సంద‌డి చేస్తే, అనుష్క పాత్ర‌లో అజు వ‌ర్గీస్ క‌నిపించింది. జిబు జాక‌బ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్నఆధ్య రాత్రి సినిమా కోసం ఈ పాట రూపొందించారు. ప్ర‌స్తుతం ఈ పాట వైర‌ల్ అవుతుంది. ఆన్ ఆమి, రంజిత్ జ‌య‌రామ‌న్ పాట ఆల‌పించగా, సంతోష్ వ‌ర్మ లిరిక్స్ అందించారు. బిజిబ‌ల్ సంగీతం అందించారు. తాజాగా విడుద‌లైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.

3825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles