నంద‌మూరి హీరో కొత్త ప్రాజెక్ట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్

Wed,June 12, 2019 10:02 AM
nKR 17 Brings together with kalyan ram

నిర్మాత‌గా, న‌టుడిగా రాణిస్తున్న క‌ళ్యాణ్ రామ్ ఇటీవ‌ల 118 అనే థ్రిల్ల‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రం క‌ళ్యాణ్ రామ్‌కి మంచి విజ‌యాన్ని అందించింది. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ త‌న 17వ చిత్రాన్ని స‌తీష్ వేగేష్న ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రంతో త‌మ ప్రొడ‌క్షన్ వెంచ‌ర్ స్టార్ట్ చేస్తుంది. త‌మ నిర్మాణంలో తొలి సారిగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రానికి సంబంధించి కొద్ది సేప‌టి క్రితం అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

1855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles