రకుల్ ప్రీత్ కు ఎవరూ ప్రపోజ్ చేయలేదట..!

Wed,May 22, 2019 08:26 PM
No one can propose to me says rakulpreetsingh


ఇప్పటివరకు తనకు ఎవరూ ప్రపోజ్ చేయలేదని చెబుతోంది టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్. ట్విట్టర్‌లో అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేసిన రకుల్..నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. తల్లిదండ్రులు తనను చూసి గర్వించే ప్రతిక్షణం ఆనందపడుతానని, తాను సరైన దారిలో ప్రయాణిస్తున్నాననడానికి అదే నిదర్శనమన్నది.

రకుల్‌ తనకు అనుష్కశర్మ, అలియాభట్, కాజోల్ తన అభిమాన నాయికలని చెప్పింది. సినిమాల్ని అమితంగా ప్రేమిస్తున్నానని తెలిపింది. స్వతహాగా తాను భోజనప్రియురాలినని, ఆరోగ్యకరమైన అన్ని రకాల ఆహారపదార్థాల్ని ఇష్టపడుతానని అంటోంది రకుల్. ఎంత తిన్నా బరువు మాత్రం పెరగకూడదన్నదే తన కల అని కూడా చెప్పింది రకుల్. మీ గ్లామర్ సీక్రెట్ ఏమిటని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నిత్యం సంతోషంగా ఉండటమే అని సమాధానమిచ్చింది రకుల్.

3263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles