బ్యాంకాక్‌లో దుస్తులు అమ్ముకుంటున్న బాహుబ‌లి డ్యాన్స‌ర్‌

Tue,June 11, 2019 10:24 AM
Nora Fatehi at Flea Market

బాహుబ‌లి చిత్రంలో మ‌నోహ‌రి అనే స్పెష‌ల్‌ సాంగ్ లో త‌న అంద చందాల‌తోనే కాక స్టెప్స్‌తోను అల‌రించిన నోరా ఫ‌తేహీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగులో వ‌చ్చిన టెంప‌ర్‌లో ఇట్టాగే రెచ్చిపోదాం అనే పాట‌కి డ్యాన్స్ వేసి అల‌రించిన నోరా రవితేజ ‘కిక్‌-2’ టైటిల్‌సాంగ్‌లోను స్టెప్పులేసింది. ‘షేర్’, ‘లోఫర్’ ‘ఊపిరి’ తదితర చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో న‌ర్తించింది. అయితే ఈ ఇండో- కెనడా మోడల్‌ ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుంది. అప్పుడ‌ప్పుడు త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌కి సంబంధించి కొన్ని వీడియోస్ షేర్ చేస్తూ అభిమానుల‌ని అల‌రిస్తుంటుంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డు బ్యాంకాక్‌లో దుస్తులు అమ్ముకుంటుంది. ఓ మార్కెట్‌లో నేల మీద కూర్చొని అచ్చం అమ్మ‌క దారుల మాదిరిగానే బ‌ట్ట‌లు అమ్ముతుంది. అక్కడ దుస్తులను విక్రయిస్తున్న నోరా వినియోగదారులతో స్థానిక భాషలోనే మాట్లాడుతుండ‌డం విశేషం . సేల్స్ గార్ల్ అవ‌తారం ఎత్తిన నోరా స్పెష‌ల్ వీడియా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

12618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles