18 ఏళ్ల‌కి ముందు, త‌ర్వాత‌.. సీన్ రిపీట్

Sat,September 28, 2019 08:15 AM

ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న ఎన్టీఆర్ కెరీర్‌కి మంచి బూస్ట‌ప్ ఇచ్చిన చిత్రం స్టూడెంట్ నం. 1. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. ముఖ్యంగా యూత్‌ని ఈ చిత్రం ఎంత‌గానో ఆక‌ట్టుకోవ‌డంతో వ‌సూళ్ళ వ‌ర్షం కురిసింది. సెప్టెంబ‌ర్ 27, 2001న విడుద‌లైన ఈ చిత్రం నిన్న‌టితో 18 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్, రాజ‌మౌళి అప్పుడు, ఇప్పుడు జ్ఞాప‌కాల‌ని త‌మ ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్నారు.


స్టూడెంట్ నెం.1 చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జ‌ర‌గ‌గా, ఇప్పుడు రాజ‌మౌళి,ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ కూడా అక్క‌డే జ‌రుగుతుంది. దీంతో ఇటు ఎన్టీఆర్ అటు రాజమౌళి అప్ప‌టికి ఇప్ప‌టికి ఎంత మారిందో ఫోటోల రూపంలో తెలియ‌జేస్తూ పాత రోజుల్ని గుర్తు చేస్తున్నారు. 18 ఏళ్ల క్రితం స్టూడెంట్ నెం. 1 చిత్రం రిలీజ్ అయింది. అనుకోకుండా ప్ర‌స్తుతం మా సినిమా షూటింగ్ ఆర్ఎఫ్‌సీ లో జ‌రుగుతుంది. ఎంతో మారింది. ఎన్టీఆర్ స‌న్న‌బడ్డాడు. నా వ‌య‌స్సు పెరిగింది. కాని ఇద్ద‌రం తెలివితేట‌ల‌తో రాణిస్తున్నాం అని అప్ప‌టి ఇప్ప‌టి ఫోటోని జ‌త‌చేసి ట్వీట్ చేశాడు జ‌క్క‌న్న‌.

ఇక ఎన్టీఆర్ కూడా సేమ్ లొకేష‌న్‌లో అప్పుడు, ఇప్పుడు దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. 18 ఏళ్ళ‌క్రితం ఈ షాట్ చిత్రీక‌రించాం. అప్ప‌టికి ఇప్ప‌టికి ఎంతో మారింది. కాని జ‌క్క‌న్న‌తో పని చేస్తే ఉండే ఫ‌న్ మాత్రం మార‌లేదు అని జూనియర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఎన్టీఆర్, రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ జూలై 30,2020న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

2457
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles