ఏ స‌మ‌యంలోనైన ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కావొచ్చు..!

Tue,October 22, 2019 10:34 AM

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు సంతోషించే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీం పాత్ర పోషిస్తున్న‌ ఎన్టీఆర్ లుక్ కోసం ఫ్యాన్స్ కొన్నాళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు. అయితే ఈ రోజు (అక్టోబర్ 22న) కొమురం భీం పుట్టిన రోజు కావ‌డంతో ఎన్టీఆర్ లుక్‌ని ఏ స‌మ‌యంలోనైన విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ రోజు నుండే చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని జ‌క్క‌న్న స్టార్ట్ చేయ‌నున్నాడ‌ని చెబుతున్నారు. ఇక మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. చరిత్రలోని రెండు పాత్రల మధ్య జరిగిన ఓ కల్పిత కథతో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జూలై 30న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. అలియా భ‌ట్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని వంటి టాప్ స్టార్స్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.
1543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles