ఎన్టీఆర్‌ ఆశీస్సులు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’కే..: వ‌ర్మ‌

Sat,February 16, 2019 05:34 PM
NTR blessed Lakshmi's NTR

హైద‌రాబాద్‌: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి విశేష స్పందన వచ్చింది. సినిమాకు సంబంధించిన ఒక్కో విష‌యాన్ని వ‌ర్మ ప్ర‌తిరోజు అభిమానుల‌తో పంచుకుంటూ సినిమాపై అంచ‌నాలను పెంచేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ పనులను కూడా వర్మ ఇప్పటికే మొదలు పెట్టాడు. నిన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీయడం వెనక ఉన్న కార‌ణాన్ని ప్రజలకు చెప్పాలని ఎన్టీ రామారావు గారు తనను అడిగారని రామ్ గోపాల్ వర్మ వాయిస్ మెసేజ్‌ను యూట్యూబ్ ద్వారా విడుదల చేసిన విష‌యం తెలిసిందే.

శ‌నివారం కూడా వ‌ర్మ త‌న‌దైన శైలిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు వ‌స్తున్న విశేష ఆద‌ర‌ణను గ‌ణాంకాల‌తో స‌హా వెల్ల‌డించారు. ట్రైల‌ర్ రిలీజ్‌ అయిన గంటన్నరలోనే మిలియన్‌ వ్యూస్ కొల్ల‌గొట్టిన‌ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రెండు రోజుల్లో కోటి వ్యూస్‌ సాధించినట్లు వర్మ ప్రకటించాడు. ప‌లు యూట్యూబ్‌ చానల్స్‌తో పాటు సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ ఇలా అన్నింటిలో కలిపి కోటికిపైగా వ్యూస్ వ‌చ్చిన‌ట్లు వర్మ లెక్క‌ల‌తో స‌హా వివ‌రించాడు. చివ‌ర‌గా ఎన్టీఆర్‌ ఆశీస్సులు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’కే ఉన్నాయ‌ని పేర్కొన్నారు.2564
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles