ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయ‌డం చాలా క‌ష్టం: స‌మంత‌

Tue,September 24, 2019 11:33 AM

మోహ‌న్ బాబు త‌న‌య మంచు ల‌క్ష్మీ 'ఫీట్ అప్ విత్ ది స్టార్' పేరుతో కొత్త టాక్‌షో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో నిజజీవితంలో స్టార్స్ ఎలా ఉంటారో అలాగే చూపించనున్నారు . స్టార్స్ ఆసక్తులు, ఎంపికలు, ఆహార్యం, బాడీలాంగ్వేజ్, నిత్యజీవితంలో వారి మనస్తత్వాన్ని మాటల ద్వారా ఆవిష్కరించనున్నారు . వివాదాలకు తావు లేకుండా చాలా సరదాగా ఉంటుంద‌ట ఈ కార్య‌క్ర‌మం. వ‌రుణ్ తేజ్‌, స‌మంత వంటి స్టార్స్ ఈ షోలో పాల్గొన‌నున్నారు. తాజాగా షోకి హాజ‌రైన‌ స‌మంత.. ఎన్టీఆర్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్స‌ర్ అని చెబుతూ ఆయ‌న‌తో డ్యాన్స్ చేయ‌డం చాలా క‌ష్ట‌మ‌ని చెప్పుకొచ్చింది. ఆయ‌న ఇలా చూసి అలా డ్యాన్స్ చేస్తారు. ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయాలంటే నా పై చాలా ప్రెష‌ర్ ఉంటుందని పేర్కొంది సామ్. జ‌న‌తా గ్యారేజ్‌, బృందావ‌నం, ర‌భ‌స‌, రామయ్యా వ‌స్తావ‌య్యా చిత్రాల‌లో స‌మంత, ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన విష‌యం తెలిసిందే.

2770
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles