ఎన్టీఆర్ లుక్ రివీల్ చేసేది ఆ రోజేనా ?

Sun,August 25, 2019 08:01 AM
ntr look release date fixed

రామ్ చ‌రణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు టాప్ స్టార్స్ నేష‌న‌ల్ వైడ్‌గా ప్ర‌జాద‌ర‌ణ పొందిన రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పేరుతో ప్ర‌చారం జ‌రుగుతున్న ఈ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. సినిమా ఫ‌స్ట్ లుక్ కోసం అభిమానులు క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ బ‌ర్త్‌డే రోజు ఏదైన అప్‌డేట్ వ‌స్తుంద‌ని అభిమానులు భావించారు. అదీ జ‌ర‌గ‌లేదు. ఆగ‌స్ట్ 15 రోజైన ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు. అప్పుడు నిరాశే ఎదురైంది. ఇక ఇప్పుడు అక్టోబర్ 22న కొమురం భీం పుట్టిన రోజు కావ‌డంతో ఆ రోజు కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్న ఎన్టీఆర్ లుక్‌ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. చరిత్రలోని రెండు పాత్రల మధ్య జరిగిన ఓ కల్పిత కథతో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జూలై 30న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. అలియా భ‌ట్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని వంటి టాప్ స్టార్స్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

1466
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles