సాయంత్రం నుండి సంద‌డి చేయ‌నున్న 'మ‌హానాయ‌కుడు' ట్రైల‌ర్

Sat,February 16, 2019 10:20 AM
Ntr Mahanayakudu trailer time fixed

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంతో రెండు సినిమాలు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ అనే పేరుతో రెండు పార్టులుగా ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నాడు. తొలి పార్ట్ క‌థానాయ‌కుడు పేరుతో విడుద‌ల కాగా రెండో పార్ట్ మ‌హానాయ‌కుడు పేరుతో ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల కానుంది. ఇక రామ్ గోపాల్ వ‌ర్మ కూడా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ బ‌యోపిక్ తీస్తున్నాడు. ఈ చిత్ర ట్రైల‌ర్ రీసెంట్‌గా విడుద‌ల కాగా, ఇది సంచ‌ల‌నాలు సృష్టించింది.

క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి సంబంధించిన తొలి పార్ట్ పెద్ద‌గా ఆద‌ర‌ణ పొంద‌క‌పోవడంతో రెండో పార్ట్‌పై ఆస‌క్తి పెరిగింది. మ‌హానాయ‌కుడు చిత్రంలో ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితంకి సంబంధించిన విశేషాల‌ని చూపించ‌నున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ క‌న్నా ఈ ట్రైల‌ర్ అభిమానుల‌ని ఎంత‌గా ఆక‌ట్టుకుంటుంది అనే దానిపై ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతుంది. రాజకీయాల్లోకి వచ్చాక... ఆయన ప్రయాణం ఎలా సాగింది? మహానాయకుడిగా ఎలా ఎదిగారు? అనే అంశాలతో మ‌హానాయ‌కుడు రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఇందులో చంద్ర‌బాబుగా రానా న‌టించ‌గా, హ‌రికృష్ణ పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ క‌నిపించ‌నున్నాడు.

2540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles