ఫ్లైట్ టిక్కెట్స్ షేర్ చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్

Fri,March 29, 2019 08:48 AM
Ntr , Ram Charan fly off to vadodara

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్‌లో క‌నిపించనున్నాడు. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను బేస్ చేసుకొని రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. నార్త్ ఇండియాలో జ‌ర‌గ‌నున్న భారీ షెడ్యూల్ కోసం తాను రామ్ చ‌ర‌ణ్ వెళుతున్న‌ట్టు ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు . హైద‌రాబాద్ నుండి వ‌డోద‌రకి బుక్ అయిన టిక్కెట్‌ని షేర్ చేస్తూ.. బిగ్ షెడ్యూల్ కోసం వెళుతున్నామ‌ని అన్నాడు జూనియ‌ర్. దాదాపు 45 రోజులు ఈ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ షెడ్యూల్‌లో అలియా భట్ , డైసీ ఎడ్గార్ జోన్స్ లు కూడా జాయిన్ కానున్నారు.జూలై 30,2020న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు .3752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles