ప్రస్తుతం కోలీవుడ్‌లో జయలలిత జీవిత నేపథ్యంలో పలు బయోపిక్‌లు రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తలైవీ అనే బయోపిక్ ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోను విడుదల కానున్న ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి కనిపించనున్నారు. అయితే తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారకరామారావు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారట. ఇప్పటికే టీం ఆయనతో సంప్రదింపులు కూడా మొదలు పెట్టిందట. మరి తన తాత పాత్రలో ఎన్టీఆర్ నటించేందుకు అంగీకరిస్తాడా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. బాలయ్య తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్‌లోనే జూనియర్ ఎన్టీఆర్ తన తాత పాత్రలో కనిపిస్తాడని అందరు ఊహించారు. కాని అది జరగలేదు. మరి ఇప్పుడు తలైవీలో నటిస్తాడా అనేది చూడాలి. తలైవీ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు.