మెగాస్టార్ మూవీ టీజ‌ర్ విడుద‌ల‌

Sun,December 9, 2018 07:16 AM

ఎన్నో విలక్షణమైన పాత్రలలో న‌టించి , మంచి భావం ఉన్న కథాంశాలతో మెప్పించిన జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్. మ‌లయాళ మెగాస్టార్ గా అభిమానులతో పిలిపించుకునే ఈ నటుడు ప్ర‌స్తుతం 600 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఒడియ‌న్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇదొక ఫాంటసీ మూవీ అని చెబుతున్నారు. ఇందులో మోహన్ లాల్ లుక్ చాలా కొత్తగా ఉంది. చిత్రంలో మోహన్ లాల్ 'ఓడియన్ మాణిక్యన్' అనే పాత్రలో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుండగా ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ భాషలలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. 3డీ టెక్నాల‌జీతో ఈ మూవీ రూపొందుతుంది . ఈ చిత్రానికి శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించగా సూపర్ పవర్స్ కలిగిన పాత్రలో మోహన్ లాల్ నటించారు.


రామ్ దగ్గుబాటి, సంపత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాయి. ఒడియన్’ వాడు.. చీకటి రాజ్యానికి రారాజు అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ సినిమాపై ఉత్కంఠ రేకెత్తించేదిగా ఉంది. ‘ఇప్పటి వరకూ నీవు నన్ను ఎన్నో రూపాల్లో చూసి ఉంటావ్.. కాని నువ్ చూడని రూపం ఇంకోటి ఉంది’ అన్న డైలాగ్‌కి తగ్గట్టుగానే వివిధ రూపాల్లో కనిపిస్తున్నారు మోహన్ లాల్. యువకుడిగా, వృద్ధుడిగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నట విశ్వరూపం చూపిస్తున్నారు మోహన్ లాల్. ఇందుకోసం యెగా, వ్యాయామాలు చేసి త‌న వ‌య‌సుని 55 సంవ‌త్స‌రాల నుండి 30 సంవ‌త్స‌రాలు కనిపించేలా శరీరాన్ని మార్చుకొని ‘ఒడియన్’గా కనిపిస్తున్నారు. మంజు వారియర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. డిసెంబ‌ర్ 14న విడుద‌ల కానున్న ఈ చిత్ర టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

4436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles