కీర్తి సురేష్ త‌మిళ ప్రాజెక్ట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్

Tue,August 13, 2019 12:05 PM

సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రంలో అస‌మాన న‌ట‌న ప్ర‌ద‌ర్శించిన అందాల తార కీర్తి సురేష్‌. మ‌హాన‌టిలో అత్యుత్త‌మ న‌ట ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చినందుకు ఆమె ఇటీవ‌ల జాతీయ అవార్డు అందుకుంది. ప్ర‌స్తుతం ప‌లు నిర్మాణ సంస్థ‌ల‌లో తెలుగు ప్రాజెక్టులు చేస్తున్న కీర్తి సురేష్ తాజాగా త‌మిళ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కార్తీక్ సుబ్బరాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలో కీర్తి క‌థానాయిక‌గా ఎంపికైన‌ట్టు టీం ప్ర‌కటించింది. సెప్టెంబ‌ర్ నుండి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ ప్రాజెక్ట్‌కి సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఎమోష‌న‌ల్‌, మిస్ట‌రీ , థ్రిల్ల‌ర్ మూవీగా ఉంటుంద‌ని చెబుతున్నారు. కీర్తి ఇటీవ‌ల మ‌న్మ‌థుడు 2 చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. స‌ర్కార్ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. నాగేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న స‌ఖి చిత్రంలో న‌టిస్తుంది .మ‌రోవైపు కీర్తి బ‌ధాయి హో ఫేం అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలో న‌టిస్తుంది. బోనీ కపూర్ నిర్మించ‌నున్న ఈ చిత్రంతో కీర్తి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్టు టాక్.
1082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles