మా సెల‌బ్రేష‌న్స్‌లో భాగం కండి : స‌మంత‌

Fri,June 28, 2019 11:38 AM

మంచి క‌థ‌, క‌థ‌నం ఉన్న చిత్రాల‌ని ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న అందాల భామ స‌మంత‌. రీసెంట్‌గా మ‌జిలీ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన స‌మంత తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబి’ సినిమా చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత స్వాతి అనే క్యారెక్టర్ చేస్తోంది. ఈ సినిమాను కొరియాలో హిట్టైన ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెర‌కెక్కించారు. ఓ సెలూన్ కు వెళ్లి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత అనుకోకుండా ఓ పెద్దావిడా.. పాతికేళ్ల భామ‌గా మారిపోతుంది. అదెలా సాధ్య‌మైంది అనేది అస‌లు క‌థ‌. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. జూలై 5న విడుద‌ల కానున్న చిత్ర ట్రైల‌ర్ రీసెంట్‌గా విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని జూన్ 29న జెఆర్‌సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌, హైద‌రాబాద్‌లో జ‌ర‌ప‌నున్న‌ట్టు చిత్ర బృందం కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించింది. మా సెల‌బ్రేష‌న్స్‌లో మీరు భాగం కండి అని స‌మంత త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.


ఓ బేబి చిత్రంలో స‌మంత వృద్ధురాల‌య్యాక ప్ర‌ముఖ న‌టి ల‌క్ష్మీ పాత్ర‌లో క‌నిపిస్తారు. రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. రాజేంద్రప్రసాద్‌ సమంతకు స్నేహితుడిగా, రావు రమేశ్‌ కుమారుడిగా, మాస్టర్‌ తేజ మనవడిగా కన్పించనున్నారు. నాగశౌర్య కీలక పాత్రను పోషించారు.

2009
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles