ఓ బేబి సాంగ్ ట్రైల‌ర్స్ విడుద‌ల‌

Sun,June 30, 2019 08:56 AM
oh baby song trailers released

అక్కినేని కోడ‌లు స‌మంత.. నందిని రెడ్డి దర్శకత్వంలో న‌టించిన చిత్రం ‘ఓ బేబి’ . సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత స్వాతి అనే క్యారెక్టర్ చేస్తోంది. ఈ సినిమాను కొరియాలో హిట్టైన ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెర‌కెక్కించారు.జూలై 5న విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని జెఆర్‌సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌, హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు . ఈ కార్య‌క్ర‌మానికి వెంకీ, రానా ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. చిత్రంలో బేబీగా స‌మంత త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని వెంకీ చెప్పారు. ఈ వేడుక‌లో సాంగ్ ట్రైల‌ర్స్ కూడా విడుద‌ల చేశారు. ఇవి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి.

సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ ఓ బేబి చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఓ బేబి చిత్రంలో స‌మంత వృద్ధురాల‌య్యాక ప్ర‌ముఖ న‌టి ల‌క్ష్మీ పాత్ర‌లో క‌నిపిస్తారు. రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. రాజేంద్రప్రసాద్‌ సమంతకు స్నేహితుడిగా, రావు రమేశ్‌ కుమారుడిగా, మాస్టర్‌ తేజ మనవడిగా కన్పించనున్నారు. నాగశౌర్య కీలక పాత్రను పోషించారు.

956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles