ఓ బేబి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Thu,June 20, 2019 10:13 AM
Oh Baby Theatrical Trailer released

ఇటీవల మ‌జిలి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన స‌మంత తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబి’ సినిమా చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత స్వాతి అనే క్యారెక్టర్ చేస్తోంది. ఈ సినిమాను కొరియాలో హిట్టైన ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెర‌కెక్కించారు. ఓ సెలూన్ కు వెళ్లి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత అనుకోకుండా ఓ పెద్దావిడా.. పాతికేళ్ల భామ‌గా మారిపోతుంది. అదెలా సాధ్య‌మైంది అనేది అస‌లు క‌థ‌. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. జూలై 5న విడుద‌ల కానున్న చిత్ర ట్రైల‌ర్‌ని తాజాగా విడుద‌ల చేశారు. ఇందులోని డైలాగ్స్‌తో పాటు స‌న్నివేశాలు అల‌రిస్తున్నాయి. స‌మంత వృద్ధురాల‌య్యాక ప్ర‌ముఖ న‌టి ల‌క్ష్మీ పాత్ర‌లో క‌నిపిస్తారు. రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. రాజేంద్రప్రసాద్‌ సమంతకు స్నేహితుడిగా, రావు రమేశ్‌ కుమారుడిగా, మాస్టర్‌ తేజ మనవడిగా కన్పించనున్నారు. నాగశౌర్య కీలక పాత్రను పోషించారు. చిత్ర ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి

1164
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles