త‌మిళంలో ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానున్న ఓ బేబి

Wed,August 7, 2019 09:20 AM

కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో ఓ బేబి అనే సినిమా రూపొందిన సంగ‌తి తెలిసిందే. నాగ‌శౌర్య‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నందిని రెడ్డి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో రావు ర‌మేష్‌, ల‌క్ష్మీ, తేజ‌, రాజేంద్ర ప్ర‌సాద్‌లు కీల‌క పాత్ర‌లు పొషించారు. 70 ఏళ్ల వృద్దురాలు తిరిగి య‌వ్వ‌నంలోకి వ‌స్తే ఎలాంటి పరిణామాలు జరిగాయి అన్న నేప‌థ్యంతో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఓ బేబి చిత్రం హిందీలో రీమేక్ కానుంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. చిత్రంలో రానా ప్ర‌ధాన పాత్ర పోషించ‌నుండ‌గా, స‌మంత పాత్ర‌లో కంగ‌నా లేదా అలియా న‌టిస్తారని టాక్. ఓ బేబి చిత్రానికి విశేష స్పంద‌న ల‌భిస్తుండ‌డంతో త‌మిళం, మ‌ల‌యాళంలో డ‌బ్ చేసి విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. ఈ క్ర‌మంలో ఆగ‌స్ట్ 15న ఓ బేబి త‌మిళ, మ‌ల‌యాళ‌ డ‌బ్బింగ్ వ‌ర్షెన్ విడుద‌ల కానుంది. స‌మంత తమిళ ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం కాబ‌ట్టి అక్క‌డ కూడా ఈ చిత్రంకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని చెబుతున్నారు. తెలంగాణ గ‌వ‌ర్నర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ మంగ‌ళ‌వారం ఆయ‌న ఫ్యామిలీతో క‌లిసి ఓ బేబి చిత్రం స్పెష‌ల్ స్క్రీనింగ్ చూసిన విష‌యం తెలిసిందే .

682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles