ఆర్ఆర్ఆర్ టీంకి మ‌రో దెబ్బ‌.. షూటింగ్‌లో గాయ‌పడ్డ ఎన్టీఆర్

Thu,April 25, 2019 11:39 AM

టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ని శ‌ర‌వేగంగా పూర్తి చేసి జూలై 30,2020న ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న రామ్ చ‌ర‌ణ్ గుజరాత్‌లోని వడోదరాలో షూటింగ్ జరుపుకుంటున్న స‌మ‌యంలో గాయ‌ప‌డ్డాడు. దీంతో చిత్ర షూటింగ్‌ 3 వారాల పాటు వాయిదా ప‌డింది. ఇక తాజాగా ఎన్టీఆర్ కూడా సెట్స్‌లో గాయ‌ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. హైద‌రాబాద్‌లో ఎన్టీఆర్‌పై కొన్ని కీల‌క సన్నివేశాలు చిత్రీక‌రిస్తుండ‌గా, ఆయ‌న‌ చేతి మ‌ణిక‌ట్టుకి గాయ‌మైంద‌ట‌. దీంతో ఆయ‌న వెంటనే ఆసుప‌త్రికి వెళ్లి వైద్యం తీసుకున్నారు. ఆసుప‌త్రి నుండి బ‌య‌ట‌కి వ‌స్తున్న స‌మ‌యంలో ఎన్టీఆర్ బ్యాండేజ్‌తో క‌నిపించ‌డంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకున్న త‌ర్వాత జూనియ‌ర్ తిరిగి షూటింగ్‌లో జాయిన్ కానున్న‌ట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఇలా వ‌రుస స‌మస్య‌లు త‌లెత్తుండ‌డంతో చిత్రం అనుకున్న స‌మ‌యానికి విడుద‌ల అవుతుందా లేదా అనే అనుమానం అభిమానుల‌లో త‌లెత్తుతుంది.

2066
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles