ఆగ‌స్ట్ నుండి సెట్స్ పైకి వెళ్ల‌నున్న క‌బాలీ డైరెక్ట‌ర్ బాలీవుడ్ చిత్రం

Wed,April 17, 2019 01:26 PM

త‌మిళ సినిమా ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల‌లో పా రంజిత్ ఒక‌రు. అట్ట‌క‌త్తి, మ‌ద్రాస్‌, క‌బాలీ, కాలా వంటి చిత్రాల‌తో త‌మిళ ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన పా రంజిత్ ఇప్పుడు బాలీవుడ్ ఆరంగేట్రం చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు. బిర్సా ముండా జీవిత నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు రంజిత్ స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. ఎన్నో రోజుల నుండి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి క‌స‌ర‌త్తులు చేసుకుంటున్న రంజిత్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ని ఫైన‌ల్ స్టేజ్‌కి తీసుకొచ్చాడ‌ట‌. ఆగ‌స్ట్ నుండి ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. న‌మ పిక్చ‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. జార్ఖండ్‌కి చెందిన గిరిజ‌న నాయ‌కుడు బిర్సా ముండా అన్న సంగతి తెలిసిందే. అప్ప‌ట్లో ఆయ‌న బ్రిటీష్ వారికి ఎదురొడ్డి నిలిచాడు. ఆయ‌న జీవిత నేప‌థ్యంలో సినిమా చేయ‌డం సంతోషంగా ఉంద‌ని రంజిత్ అంటున్నారు.

982
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles