రావ‌ణుడిగా మార‌నున్న ప్ర‌భాస్..?

Wed,September 18, 2019 08:37 AM

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ స్టార్ అయిన ప్రభాస్ తాజాగా విడుద‌లైన సాహో చిత్రంతో త‌న క్రేజ్ మ‌రింత పెంచుకున్నాడు. తెలుగులో క‌న్నా హిందీలోనే సాహో చిత్రానికి ఎక్కువ ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. రానున్న రోజుల‌లో ప్ర‌భాస్ న‌టించిన ప్ర‌తి చిత్రం ఇటు తెలుగుతో పాటు వేరే భాష‌ల‌లోను విడుద‌ల చేస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుద‌ల కానుంది. క‌ట్ చేస్తే ప్ర‌భాస్ అల్లు రామాయ‌ణంలో రావ‌ణుడిగా క‌నిపించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.


తెలుగులో భారీ సినిమాల‌కు పెట్టింది పేరు అల్లు అర‌వింద్. తెలుగు,తమిళ్, హిందీ భాషల్లో దాదాపు రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడు పార్టులతో ‘రామాయణం’ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ఇటీవ‌ల అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రాముడిగా ముందుగా రామ్ చరణ్ పేరు వినిపించ‌గా, ఆ త‌ర్వాత హృతిక్ అని అన్నారు. సీత‌గా దీపికా ప‌దుకొణేని ఎంపిక చేసిన‌ట్టు చెప్పారు. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో రావ‌ణుడిగా ప్ర‌భాస్ న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్రభాస్ ఆ పాత్ర‌లో స‌రిగ్గా సూట‌వుతాడ‌ని కూడా నెటిజ‌న్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్ట్‌లో భారీ క్యాస్టింగ్ ఉంటుంద‌ని స‌మాచారం. అల్లు అర‌వింద్‌తో పాటు మ‌ధు మంతెన‌, న‌మిత మ‌ల్హోత్రా చిత్రానికి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

3914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles