'మ‌హ‌ర్షి' ఫుల్ వీడియో సాంగ్స్ విడుద‌ల‌

Wed,July 3, 2019 08:14 AM
Padara Padara Full Video Song released

మహేశ్ బాబు, వంశీపైడిపల్లి కాంబినేషన్ లో తెర‌కెక్కిన‌ చిత్రం మహర్షి. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించిన ఈ చిత్రం ఇప్ప‌టికి కూడా మంచి క‌లెక్ష‌న్స్‌ని రాబ‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. అయితే చిత్రం నుండి ప‌లు వీడియో సాంగ్స్ విడుద‌ల చేస్తున్న టీం తాజాగా ‘పదర పదర పదరా..నీ అడుగుకి పదును పెట్టి పదరా.. ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా..’ అంటూ సాగే పాటకి సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ని విడుద‌ల చేశారు.

అద్బుతమైన లిరిక్స్ తో సాగిన ఈ పాట ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించింది .ఈ పాటను శ్రీమణి రాశారు. దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో శంకర్ మహదేవన్ ఈ పాటను పాడాడు. మహేష్ మొదటి సినిమా ‘రాజకుమారుడు’లో ‘బాలీవుడ్ బాలరాజు’ అనే పాటను పాడిన శంకర్ మహదేవన్..మళ్లీ 20 సంవత్సరాల తర్వాత ‘మహర్షి’లో ఈ పాట పాడటం విశేషం. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషించారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇదే క‌థ ఇదే క‌థ అనే సాంగ్‌తో పాటు నువ్వే స‌మ‌స్తం , నువ్వ‌ని ఇది నీద‌ని, ఫిర్ షురూ, పాల‌పిట్ట‌ అనే పాట‌కి సంబంధించి ఫుల్ వీడియో విడుద‌ల చేశారు. వాటిపై మీరు ఓ లుక్కేయండి

1296
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles