భార‌తీయ సినిమా సీడీల‌ని సీజ్ చేస్తున్న‌ పాక్

Fri,August 16, 2019 01:35 PM
Pakistan launches crackdown on sale of Indian products

క‌శ్మీర్‌కి ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి క‌లిగించే ఉద్ధేశంతో మోదీ ప్ర‌భుత్తం ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆర్టిక‌ల్ 370 ర‌ద్ధు కార‌ణంగా పాక్ ప్ర‌భుత్వం మ‌న సినిమాల‌ని పాక్‌లో నిషేదించింది. తాజాగా ఇండియ‌న్ సినిమాల‌కి సంబంధించిన సీడీలని సీజ్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంది. ఇవే కాక‌ భారతీయ కళాకారులు మరియు భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించే ప్రకటనలను ప్రసారం చేయడాన్ని నిషేదించే నిర్ణ‌యాన్ని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పెమ్రా) తీసుకుంది. ఈ విష‌యాన్ని డాన్ న్యూస్ పేప‌ర్ తెలిపింది. ప్ర‌ధాని అసిస్టెంట్ ఫిర్ధోష్ ఆషిఖ్ అవాన్ శుక్ర‌వారం ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని ప‌త్రిక‌లో ప్ర‌చురించారు. ఆమె నిర్ణ‌యంతో డెటాల్ సోప్‌, స‌ర్ఫ్ ఎక్సెల్ పౌడ‌ర్, ప్యాంటీన్ షాంపూ, హెడ్ అండ్ షోల్డ‌ర్స్ షాంపూ. లైఫ్ బాయ్ షాంపూ, ఫాగ్ బాడీ స్ప్రే,స‌న్ సిల్క్ షాంపూ, నార్ నూడిల్స్‌, ఫెయిర్ అండ్ ల‌వ్‌లీ ఫేస్ వాష్‌, సేఫ్ గార్డ్ సోప్ త‌దిత‌ర ఉత్ప‌త్తులు పాక్‌లో నిషేదించ‌బ‌డ్డ‌ట్టు పేర్కొన్నారు.

1584
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles