త‌న పెళ్ళిపై వ‌చ్చిన వార్త‌ల‌ని కొట్టి పారేసిన ప‌రిణితీ

Sat,December 15, 2018 01:02 PM
Parineeti Chopra Clears The Wedding Rumours

బాలీవుడ్ భామ‌లు ఒక్కొక్క‌రు వ‌రుస‌గా పెళ్లి పీట‌లు ఎక్కుతుండ‌గా, యువ హీరోయిన్ ప‌రిణితీ చోప్రా త‌న బాయ్‌ఫ్రెండ్‌ని త్వర‌లోనే వివాహం చేసుకోనుంద‌ని ఓ ఇంగ్లీష్ పత్రిక ప్ర‌చురించింది. ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ప‌రిణితీ చోప్రా త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించింది. ఆ పత్రిక‌లో వ‌చ్చిన వార్త నిరాధారిత‌మైన‌ది. అందులో ఏ మాత్రం నిజం లేదు . నేను పెళ్ళి చేసుకోవాలని అనుకున్న‌ప్పుడు సంతోషంగా ఎనౌన్స్ చేస్తా అని పేర్కొంది. ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం ప్రియాంక చోప్రా సోద‌రి ప‌రిణితీ చోప్రా కొద్ది రోజులుగా చారిట్ దేశాయ్ అనే వ్య‌క్తితో డేటింగ్‌లో ఉంద‌ని, ఆయ‌న ఇటీవ‌ల జరిగిన ప్రియాంక‌ పెళ్లికి హాజ‌ర‌య్యాడ‌ని రాశారు. ఆ వ్యక్తి ప‌రిణితీ ఫ్యామిలీకి న‌చ్చ‌డంతో త్వ‌ర‌లోనే వివాహం జ‌ర‌ప‌నున్నార‌ని ప్ర‌చురించారు. చారిట్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్నాడ‌ని స‌మాచారం. పెళ్లి వార్త‌ల‌ని ప‌రిణితీ చోప్రా కొట్టి పారేసిన నేప‌థ్యంలో ఆమె పెళ్లి కోసం అభిమానులు కొన్నాళ్ళు ఎదురు చూడ‌క త‌ప్ప‌దు.


3001
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles