ఫ్రెండ్ ఆఫ్ ఆస్ట్రేలియాగా ఎంపికైనందుకు హ్యాపీ..

Sun,February 25, 2018 07:46 PM
parineeti chopra is new friend of australia


ఫ్రెండ్ ఆఫ్ ఆస్ట్రేలియాగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది బాలీవుడ్ నటి పరిణితి చోప్రా. . ఈ హీరోయిన్ఆస్ట్రేలియా టూరిజం రాయబారిగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిణీతి మాట్లాడుతూ ఆస్ట్రేలియా ఇష్టమైన పర్యాటక దేశాల్లో ఒకటి. గత ఏడాదే నేను ఆ దేశం వెళ్లాను. ఒక ట్రిప్పు అయితే చాలదు అని పేర్కొంది. పర్యాటక శాఖ అంబాసిడర్‌గా పరిణితి క్వీన్స్‌ల్యాండ్‌తో పాటు వివిధ ప్రసిద్ధ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఆస్ట్రేలియా పర్యాటక శాఖ రాయబారిగా వ్యవహరించనున్న తొలి భారతీయ మహిళ కూడా పరిణితే కావడం విశేషం. ఫ్రెండ్ ఆఫ్ ఆస్ట్రేలియా (ఎఫ్‌ఓఏ) అడ్వొకసీ ప్యానెల్‌లో పరిణితితో పాటు ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్, క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే కూడా ఉన్నారు.

2331
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles